ఫ్లోరోసిస్ నిర్మూలనకై తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR Expressed condolences on Demise of Amshala Swamy who fought for Eradication of Fluorosis throughout his Life,Minister KTR Condolences,Demise of Amshala Swamy,Fights Against Fluorosis in Nalgonda,Mango News,Mango News Telugu,Amshala Swamy Nalgonda District,Amshala Swamy Nalgonda Phone Number,Amshala Swamy Nalgonda Telangana,Amshala Swamy Nalgonda Contact Number,Amshala Swamy Nalgonda Pincode,Fluorosis In Nalgonda Wiki,Fluoride Affected Areas In Telangana,Fluoride Affected Mandals In Nalgonda,Fluoride Chemical,Fluoride Contamination In Nalgonda District,Fluoride Problem In Nalgonda District,Nalgonda Technique,Nalgonda Technique Of Fluoride Removal,Nalgonda Town

ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్ పేరు గుర్తుకు రాగానే తక్షణమే గుర్తుకు వచ్చే పేరు అంశాల స్వామి అని సీఎం గుర్తుకు చేసుకున్నారు. మానవీయ కోణాన్ని తట్టి లేపుతూ తెలంగాణ ఉద్యమంలో అంశాల స్వామి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా, ఫ్లోరోసిస్ రహిత శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి, ప్లోరోసిస్ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని సీఎం తెలిపారు. అంశాల స్వామి మరణం బాధాకరమని విచారం సీఎం వ్యక్తం చేసారు. అంశాల స్వామి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here