విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి, హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నారాయణ హృదయాలయ ఆసుపత్రి

Narayana Hrudayalaya Hospital Releases Health Bulletin on Nandamuri Tarakaratna Health Condition,Janasena Chief Pawan Kalyan,Wishes Nandamuri Taraka Ratna,Taraka Ratna for Speedy Recovery,Mango News,Mango News Telugu,Nandamuri Taraka Ratna,Nandamuri Taraka Ratna Latest News and Updates,Nandamuri Taraka Ratna Health,Nandamuri Taraka Ratna Health Status,Nandamuri Taraka Ratna Latest Updates,Nandamuri Taraka Ratna Health Updates,Nandamuri Taraka Ratna Latest Updates,Yuvagalam Padauatra

ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యి ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ ఆసుపత్రి తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.

“నందమూరి తారకరత్న జనవరి 27న కుప్పంలో గుండెపోటుకు గురయ్యారు. 45 నిమిషాల పాటు పునరుజ్జీవనం (అపస్మారక స్థితి నుంచి స్పృహలోకి తీసుకురావడం) మరియు ప్రాథమిక చికిత్స అనంతరం కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తృతీయ కేంద్రానికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. అతని పరిస్థితిని అంచనా వేయడానికి నారాయణ హృదయాలయ నుండి వైద్యుల బృందం కుప్పం వెళ్లినప్పుడు, బెంగళూరులోని నారాయణ హృదయాలయకి అతనిని తరలించమని మేము అభ్యర్థించాము. అతనికి ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్ (ఐఏబీపీ) మరియు వాసోయాక్టివ్ సపోర్ట్‌పై బెలూన్ యాంజియోప్లాస్టీతో యాంటీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఉన్నట్లు కనుగొనబడింది. జనవరి 28, శనివారం 1 (ఏఎం) గంటకు రోడ్డు మార్గం మీదుగా నారాయణ హృదయాలయకి తరలించబడ్డాడు. నారాయణ హృదయాలయకి చేరుకున్నాక ఉన్నతస్థాయి డయాగ్నస్టిక్స్‌ నిర్వహించాకా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతని పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని తెలిసింది మరియు ప్రామాణిక మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌ల క్రింద అతని పరిస్థితి యొక్క ఎవాల్యూవేషన్ చికిత్సతో పాటుగా కొనసాగుతుంది. అతను ప్రస్తుతం నారాయణ హృదయాలయలో కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లు మరియు ఇతర నిపుణులతో సహా మల్టీ డిసిప్లినరీ క్లినికల్ బృందం సంరక్షణలో ఉన్నాడు. అతను మాగ్జిమమ్ సపోర్ట్ తో క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు. అతను రాబోయే రోజుల్లో కఠినమైన ఎవాల్యూవేషన్ మరియు చికిత్సలో కొనసాగుతారు. నందమూరి తారకరత్నకు గోప్యత మరియు అంతరాయం లేని చికిత్స కోసం మేము ఈ సమయంలో సందర్శకులను రావొద్దని/నిరుత్సహపరుస్తూ మేము అభ్యర్థిస్తున్నాము” అని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 11 =