జంటనగరాల్లో కొత్త రూల్స్.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల కొరడా, ఇకపై గీతదాటితే..

Hyderabad Police Announces New Traffic Rules and Challans From October 3, Hyderabad Police Announces New Traffic Rules, New Traffic Rules and Challans, Hyderabad New Traffic Rules and Challans, Hyderabad New Traffic Rules, Hyderabad New Challans, Mango News, Mango News Telugu, Hyderabad Traffic Police, New Traffic Rules In Hyderabad 2022, New Traffic Rules Hyderabad, New Traffic Rules, Traffic Challan Rates In Hyderabad 2022, Traffic Challan Latest News And Updates

జంటనగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి పోలీసులు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో రోప్‌ (రిమూవల్‌ ఆప్‌ అబ్‌స్ట్రిక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌) పేరుతో కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని ట్రాఫిక్​ పోలీస్​ జాయింట్​ కమిషనర్​ రంగనాథ్​ స్పష్టం చేశారు. జంట నగరాల్లో ఇప్ప‌టికే లైసెన్స్, హెల్మెట్ లేకపోయినా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా, మితి మీరిన వేగంతో వెళ్లినా, నో పార్కింగ్ జోన్‌లో వాహ‌నాలు నిలిపినా భారీ జ‌రిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త రూల్స్ ప్రకారం.. సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిప్రకారం, స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1,000 జరిమానా విధించనున్నారు. ఇంకా వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ వద్ద వెళ్లేవారికి ఆటంకం కలిగేలా వ్యవహరించినా కూడా రూ.1,000 జరిమానా విధిస్తారు. అలాగే ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు వస్తువులు పెడితే భారీ జరిమానా, పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 ఫైన్ విధించనున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు, నిబంధనలను ఉల్లఘనలకు సంబంధించి వాట్సాప్​లోనూ చలాన్లు రానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =