నిఖత్ జరీన్, ఈషాసింగ్ లకు రూ.2 కోట్ల చెక్కులను, మొగిలయ్యకు రూ.కోటి చెక్‌ ను అందించిన సీఎం కేసీఆర్

CM KCR Handover Rs 2 Cr Cheques to Nikhat Zareen Esha Singh and Rs 1Cr Cheque to Padmashri Mogilaiah, KCR Handover Rs 2 Cr Cheques to Nikhat Zareen Esha Singh and Rs 1Cr Cheque to Padmashri Mogilaiah, Telangana CM KCR Handover Rs 2 Cr Cheques to Nikhat Zareen Esha Singh and Rs 1Cr Cheque to Padmashri Mogilaiah, Telangana CM KCR Handover Rs 2 Cr Cheque to Nikhat Zareen, Telangana CM KCR Handover Rs 2 Cr Cheque to Esha Singh, Telangana CM KCR Handover Rs 1Cr Cheque to Padmashri Mogilaiah, 2 Cr Cheque to Nikhat Zareen, 2 Cr Cheque to Esha Singh, 1Cr Cheque to Padmashri Mogilaiah, Padmashri Mogilaiah, Telangana Day, Telangana Formation Day Celebrations News, Telangana Formation Day Celebrations Latest News, Telangana Formation Day Celebrations Latest Updates, Telangana Formation Day Celebrations Live Updates, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ నాంపల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్స్ లో గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంతరం ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో అంశాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని, అభివృద్ధిని వివరిస్తూ సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. మరోవైపు ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌ లను సీఎం కేసీఆర్‌ సత్కరించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా పద్మశ్రీ మొగిలయ్యకు రూ.కోటి చెక్‌ ను, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌కు రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందించారు.

ముందుగా ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన నిఖత్ జరీన్ కు, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐ.ఎస్.ఎస్.ఎఫ్) జూనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఈషా సింగ్ కు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నగదు బహుమతిని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నజరానాకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది.

అలాగే పద్మ శ్రీ పుర‌స్కారాన్ని పొందిన తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను అందించనున్నట్టు సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా మొగిలయ్యకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గతంలో మొగిలయ్య కోరుకున్నట్టుగా బి.ఎన్.రెడ్డి నగర్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =