ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌?

CM KCR Holds Emergency Meet With Ministers And Higher Officials At Yerravalli Farmhouse, CM KCR Holds Emergency Meet With Ministers And Higher Officials, CM KCR Holds Emergency Meet With Ministers At Yerravalli Farmhouse, CM KCR Holds Emergency Meet With Higher Officials At Yerravalli Farmhouse, CM KCR Holds Emergency Meet, Emergency Meet, Yerravalli Farmhouse, CM KCR Yerravalli Farmhouse, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Chief minister of Telangana Holds Emergency Meet With Ministers And Higher Officials At Yerravalli Farmhouse, Telangana, Mango News, Mango News Telugu,

ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్ ‌వద్ద సీఎం కేసీఆర్‌ ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీ ఆకస్మికంగా జరగడంతో అందుబాటులో ఉన్న మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారని చెప్తున్నారు. మంత్రులు హరీష్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సబితా ఇద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి‌ హాజరైనట్లు తెలుస్తోంది.

శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కవిత కూడా ఈ సమావేశానికి వచ్చినట్లు సమాచారం. ఇక సమావేశంలో ప్రధానంగా.. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల విడుదలపై ప్రభుత్వ అధికారులతో చర్చించారని సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం కోసం వేచి చూడాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =