నేడు జమ్మూలో 83వ సీఆర్పీఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Union Home Minister Amit Shah Participates in 83rd CRPF Raising Day Program At Jammu, Union Home Minister Amit Shah Participates in 83rd CRPF Raising Day Program, CRPF Raising Day Program, CRPF, Central Reserve Police Force Raising Day Program At Jammu, Central Reserve Police Force Raising Day Program, Central Reserve Police Force, CRPF Raising Day Program Latest News, CRPF Raising Day Program Latest Updates, CRPF Raising Day Program Live Updates, Union Home Minister Amit Shah, Union Home Minister, Amit Shah, Amit Shah Participates in 83rd Central Reserve Police Force Raising Day Program At Jammu, Amit Shah Participates in 83rd CRPF Raising Day Program, Minister of Home Affairs, the first Minister of Co-operation of India, Mango News, Mango News Telugu,

నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 83వ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సీఆర్పీఎఫ్ తన రైజింగ్ డేని జరుపుకోవడం ఇదే మొదటిసారి. శనివారం జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో సీఆర్పీఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో పాల్గొన్న అమిత్ షా ఈ సందర్భంగా.. ఉగ్రవాద సంఘటనలలో మరణించిన జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు, బంధువులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దీనికి ముందుగా ఆయన, “జమ్మూ మరియు కాశ్మీర్‌ను సురక్షితంగా ఉంచడానికి దేశం మొత్తం వారి అంకితభావం మరియు పరాక్రమానికి గర్విస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం J-K లోని అందరు పోలీసులు మరియు వారి కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

గత ఐదు నెలల్లో అమిత్ షా జమ్మూలో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు ఐదు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. అమర్‌నాథ్ యాత్రకు ముందు భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1950లో పార్లమెంట్ ద్వారా సీఆర్పీఎఫ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా మార్చి 19న సీఆర్పీఎఫ్ రైజింగ్ డే నిర్వహించబడుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వం 1939లో ఇదే రోజున సీఆర్పీఎఫ్ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్‌గా ఎదిగింది. అనంతరం 28 డిసెంబర్ 1949న సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌గా పునర్నిర్మించబడింది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కొత్త విధి, విధానాలు రూపొందించారు. సీఆర్పీఎఫ్ సంస్థ ప్రధానంగా దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 13 =