భారత్‌ పర్యటనకు రానున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ప్రధాని మోదీతో కీలక భేటీ

India-Japan 14th Annual Summit Japan PM Fumio Kishida to Visit India for 2 Days, India-Japan 14th Annual Summit, Japan PM Fumio Kishida to Visit India for 2 Days, India-Japan, India, Japan, India-Japan Annual Summit, Japan PM Fumio Kishida, Japan PM, PM Fumio Kishida, India-Japan 14th Annual Summit Latest News, India-Japan 14th Annual Summit Latest Updates, India-Japan Summit, Japanese PM Fumio Kishida, Japanese PM Fumio Kishida begins 2-day India visit from today, 14th India-Japan Annual Summit, PM Modi and Japan PM Kishida Fumio To Meet For India-Japan 14th Annual Summit, Japan PM Fumio Kishida begins 2-day India visit from today, Japan PM Fumio Kishida begins 2-day India visit, Japanese PM Fumio Kishida, Annual Summit, Mango News, Mango News Telugu,

జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా మార్చి 19, 20వ తేదీల్లో రెండు రోజుల పాటుగా భారత్ లో పర్యటించనున్నారు. 14వ ఇండియా-జపాన్ వార్షిక సమ్మిట్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫుమియో కిషిడా శనివారం నాడు భారత్ పర్యటనకు రానున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ఈ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ప్రధాని మోదీ మధ్య కీలక భేటీ జరగనుంది. జపాన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో భారత్‌ కు వచ్చిన కిషిడా ప్రధాని మోదీని పలుసార్లు కలిశారు. అయితే జపాన్ ప్రధాని హోదాలో ఈ శిఖరాగ్ర సమావేశమే ఇరువురూ నేతల మధ్య తొలి సమావేశం కానుంది. ఇక మునుపటి ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 2018లో టోక్యోలో జరిగిన విషయం తెలిసిందే.

భారత్ మరియు జపాన్ “ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యం” పరిధిలో బహుముఖ సహకారాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత మరియు శ్రేయస్సు కోసం తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి మరియు బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో చర్చలు జరగనున్నట్టు తెలిపారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి మరియు పలు అంశాలపై చర్చలకు కూడా ఈ శిఖరాగ్ర సమావేశం అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − four =