జూన్ 9న రాష్ట్రంలో 19 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ప్రారంభం: సీఎం కేసీఆర్

19 Diagnostic Centres in 19 Districts In Telangana, 19 Diagnostic Centres in 19 Districts on June 7th, 19 govt diagnostic centres to be opened, CM KCR Decided to Start 19 Diagnostic Centres in 19 Districts, CM KCR Decided to Start 19 Diagnostic Centres in 19 Districts on June 7th, CM KCR Decided To Start Diagnostic Centers, CM KCR Now Changed Launch Date of 19 Diagnostic Centres in the State to June 9, free medical tests in telangana, Launch Date of 19 Diagnostic Centres in the State to June 9, Mango News, telangana, Telangana 19 Diagnostic Centres in 19 Districts, Telangana CM KCR

తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోస్టిక్‌ సెంటర్లను) ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ డయాగ్నోస్టిక్‌ సెంటర్లను నేటి నుంచి(జూన్ 7, సోమవారం) ప్రారంభించాలనుకోగా, తాజాగా జూన్ 9 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నోస్టిక్‌ సెంటర్ల ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద జూన్ 8న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ డయాగ్నోసిస్ కేంద్రాల ప్రారంభం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + five =