కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి పత్తిపాక మోహన్‌ ఎంపికవడంపై సీఎం కేసీఆర్ హర్షం

CM KCR Expressed Happiness over Selection of Pattipaka Mohan for Sahitya AKademi Bala Sahitya Puraskar 2022, Pattipaka Mohan for Sahitya AKademi Bala Sahitya Puraskar 2022, Sahitya AKademi Bala Sahitya Puraskar 2022, 2022 Sahitya AKademi Bala Sahitya Puraskar, Sahitya AKademi Bala Sahitya Puraskar, Telangana CM KCR Expressed Happiness, Pattipaka Mohan, Telangana CM KCR, Bal Sahitya award, Pattipaka Mohan News, Pattipaka Mohan Latest News And Updates, Pattipaka Mohan Live Updates, Mango News, Mango News Telugu,

బాల సాహిత్య పురస్కార్-2022 మరియు యువ పురస్కార్-2022 అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం నాడు ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ మొత్తం 22 భాషలకు చెందిన రచయితలు/కవులకు బాలసాహిత్య పురస్కారాలను ప్రకటించారు. ఇందులో తెలుగుకు సంబంధించి ‘బాలల తాతా బాపూజీ’ కవిత్వం పుస్తకంకు గానూ తెలంగాణ‌కు చెందిన క‌వి డాక్ట‌ర్ ప‌త్తిపాక మోహ‌న్‌ ను బాల‌ సాహిత్య పుర‌స్కారం వరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి డా.పత్తిపాక మోహన్‌ ఎంపికవడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గాంధీజీపై ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కడం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు. కీ.శే.డాక్టర్‌ సి.నారాయణరెడ్డి శిష్యుడు, సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన పత్తిపాక మోహన్ సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

మరోవైపు యువ పురస్కార్-2022 అవార్డుల్లో భాగంగా ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన కవి పళ్లిపట్టు నాగరాజు పురస్కారాన్ని దక్కించుకున్నాడు. మొత్తం 23 భాషలకు చెందిన రచయితలు/కవులకు యువ పురస్కార్ అవార్డులను ప్రకటించగా, ఇందులో తెలుగుకు సంబంధించి ‘యాలై పూడ్సింది’ కవిత్వం పుస్తకంకు గానూ నాగరాజు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్-2022 అవార్డుకు ఎంపికయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 17 =