నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ బాడీ మీటింగ్.. జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్‌

CM KCR To Announce National Party After TRS Party General Body Meeting to Be Held at Telangana Bhavan Today, CM KCR To Announce National Party, TRS Party General Body Meeting, National Party Meeting Held at Telangana Bhavan, Mango News, Mango News Telugu, KCR National Party , TRS Party Live News And Updates, KCR New Party, BRS Party , TRS as Bharat Rashtra Samithi, TRS Name Changes To BRS, TRS Party, BRS Party Latest News And Live Updates, BRS Party Chief KCR, KCR, KTR, Kavitha Kalavakuntla

టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దసరా పండుగ సందర్భంగా నేడు జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం (జనరల్‌ బాడీ మీటింగ్) నిర్వహించనున్నారు. కాగా ఈ సమావేశానికి పార్టీలోని అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు తదితరులు హాజరుకానున్నారు. మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈరోజు జరుగనున్న సమావేశంలో పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ముందుగా పార్టీ పేరు మార్పు ఆవశ్యకతను వివరించి విధాన పరమైన నిర్ణయం తీసుకోనున్నారు. దీనిలో భాగంగా సమావేశంలో పార్టీ పేరు మార్పుపై సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనికి మొత్తం 283 మంది సభ్యులు ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలుపనున్నారు. ఇక మధ్యాహ్నం గం 1:19 ని.లకు తీర్మానంపై సంతకం చేయనున్న సీఎం కేసీఆర్.. అనంతరం జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం ప్రకటన వెలువడిన తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ సంబురాలు చేయడానికి టీఆర్‌ఎస్‌ నేతలు సమాయత్తమవుతున్నారు.

సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్‌ వస్తున్న ఇతర రాష్ట్రాల నేతలు

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి అడుగిడుతున్న సందర్భంగా.. ఆయన రాకను ఆహ్వానిస్తూ ఇతర రాష్ట్రాల నేతలు తమ సంఘీభావం తెలుపనున్నారు. నేడు జాతీయ పార్టీ ప్రకటన అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిసి అభినందించేందుకు వారు హైదరాబాద్‌ నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో జేడీఎస్‌ అగ్రనేత, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, ఆ రాష్ట్ర మాజీ మంత్రి రేవణ్ణ సహా పలువురు జేడీఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో వారికి టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు. అలాగే తమిళనాడుకు చెందిన ‘విదుతాలై చిరుత్తైగళ్‌ కట్చె’ పార్టీ అధ్యక్షుడు, చిదంబరం పార్లమెంట్‌ సభ్యుడు, ప్రముఖ దళితనేత తిరుమల్‌ వలవన్‌ కూడా సీఎం కేసీఆర్‌ను కలవడానికి నగరానికి చేరుకున్నారు. మరోవైపు పంజాబ్‌, మహారాష్ట్రల నుంచి కూడా పలువురు ప్రముఖులు రానున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here