పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

YCP MP Vijayasai Reddy Appointed as Chairman of Parliamentary Standing Committee on Transport Tourism and Culture, YCP MP Vijayasai Reddy, Chairman of Parliamentary Standing Committee, Transport Tourism and Culture, Mango News, Mango News Telugu, YSRCP MP Vijayasai Reddy, Parliamentary Standing Committee Chairman, Parliamentary Standing Committee Chairman Vijayasai Reddy, YSR Congress Party, AP CM YS Jagan Mohan Reddy, YSRCP Latest News And Updates, Vijayasai Reddy News And Live Updates

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఉపరితల రవాణా, పర్యాటక, టూరిజం మరియు సంస్కృతిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ మంగళవారం రాజ్యసభ సెక్రటేరియట్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం 2022-2023కి సంబంధించిన డిపార్ట్‌మెంట్-సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు 13 సెప్టెంబర్ 2022 నుండి అమలులోకి రానున్నాయి. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. తనను రవాణా, పర్యాటకం మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్‌గా నియమించినందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు ట్విట్టర్ వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు ఈ అవకాశం కల్పించినందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి గురుతరమైన బాధ్యతలు అప్పగిస్తూ, ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తున్నందుకు సీఎం జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =