జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR, CM KCR to inaugurate Siddipet Collectorate, CM KCR will Inaugurate New Collectorate and Police Commissionerate, CM KCR will Inaugurate New Collectorate and Police Commissionerate at Siddipet, CM KCR will Inaugurate New Collectorate and Police Commissionerate at Siddipet on June 20, KCR to inaugurate Siddipet collectorate, Mango News, New Collectorate and Police Commissionerate, New Collectorate and Police Commissionerate at Siddipet, Siddipet

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడే కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ను బుధవారం నాడు అధికారులతో కలిసి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధునాతన హంగులతో రూ.81 కోట్ల వ్యయంతో జిల్లా కార్యాలయాల సమీకృత భవన సముదాయం, పోలీసు కమిషనరేట్‌ భవనాల నిర్మాణం చేపట్టారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా దుద్దెడ వద్ద G+2 విధానంలో ఈ జిల్లా కార్యాలయాల సమీకృత సముదాయం నిర్మించబడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here