ఆగస్టు 4న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR will Inaugurate Police Command and Control Centre at Banjara Hills on August 4, Telangana CM KCR will Inaugurate Police Command and Control Centre at Banjara Hills on August 4, KCR will Inaugurate Police Command and Control Centre at Banjara Hills on August 4, Police Command and Control Centre at Banjara Hills, Banjara Hills Police Command and Control Centre, Police Command and Control Centre, iconic Integrated Command and Control Centre at Banjara Hills, New Police Command and Control Centre at Banjara Hills, Hyderabad Police Commissionerate, Banjara Hills, Police Command and Control Centre News, Police Command and Control Centre Latest News, Police Command and Control Centre Latest Updates, Police Command and Control Centre Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఆగస్టు 4వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్​ శాఖ ఘనంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రతిష్టను పెంచేలా, అప్పగించిన పనులను నిబద్ధతతో, ఉత్సాహంతో నిర్వర్తించాలని కోరారు. అలాగే మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీవీ ఆనంద్ వివిధ విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడనుంది. బంజారాహిల్స్‌లో మొత్తం రూ.585 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక, సదుపాయాలతో 19 అంతస్థుల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో మొత్తం ఐదు టవర్స్ ఉండగా, డేటా సెంటర్లను, హెలిప్యాడ్, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఈ భవనంలో 14, 15 అంతస్థుల వరకు సందర్శకులను కూడా అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసు శాఖతో పాటు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇతర శాఖల అధికారులు కూడా సమావేశమై పరిష్కరించేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా ప్రాచుర్యం పొందేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తీర్చిదిద్దారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + two =