నేడు యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

CM KCR will Inspect the Construction Works of Yadadri Thermal Power Plant at Dameracherla Today,CM KCR Inspected Yadadri Thermal Power Plant,Construction Works of Yadadri Thermal Power Plant,Yadadri Thermal Power Plant,Thermal Power Plant at Dameracherla,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు (నవంబర్ 28, సోమ‌వారం) నల్గొండ జిల్లాలోని దామరచర్లలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ పర్యటనలో భాగంగా దామరచర్లలో యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ పనులు 2015లో ప్రారంభంకాగా, రూ.29,965 కోట్ల వ్యయంతో మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా 5 యూనిట్లతో ఈ ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను నిర్మాణం జరుగుతుంది. ఒక్కో యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌నున్నారు. రెండు యూనిట్లలో 90 శాతం పనులు పూర్తవగా, మరో మూడు యూనిట్లలో 70 శాతం వరకు పనులు అయినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయంకు చేరుకొని, అక్కడినుంచి హెలికాప్టర్‌ లో మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్లకు చేరుకోనున్నారు. థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ కు సీఎం కేసీఆర్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here