సింగపూర్‌లో జరుగనున్న ‘వరల్డ్‌ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్‌ లోగో’ను ఆవిషరించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Unveils The Logo For World Telangana IT Conference to be Held in Singapore,KTR unveiled logo World Telangana IT Conference,Telangana IT Conference Singapore,World Telangana IT Conference,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సింగపూర్‌లో రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో ‘వరల్డ్‌ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్‌’ జరుగనుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా)తో కలిసి రాష్ట్ర భుత్వం దీనిని నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఐటీ నిపుణులను ఒక వేదికపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి సంబంధించిన లోగోను టీహబ్‌లో ఆదివారం రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఆవిషరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని టెక్కీలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నామని, టెక్నాలజీ ఎక్సేంజ్‌, ఇన్నోవేషన్స్‌పై దృష్టి సారించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణలో పెట్టుబడులు, కొత్త టెక్నాలజీలను ప్రోత్సహిస్తామని, కావున సింగపూర్‌లో జరిగే తొలి ప్రపంచ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సులో తెలుగు టెక్కీలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ‘టీటా’ నిర్వహించే కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వ మద్దతు ఉంటుందని, టీటా ద‌శాబ్ది వార్షికోత్స‌వాల్లో భాగంగా వ‌ర‌ల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హ‌ణ‌కు చొర‌వ‌ తీసుకుని ముందుకు రావడం హర్షించదగినదని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఇక ‘టీటా’. గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రపంచ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తొలి సదస్సు సింగపూర్‌లో జరుగుతుందని, ఇక నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఇలాంటి సదస్సులు ఒక్కో దేశంలో నిర్వహించి టెక్కీలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =