ఆ పార్లమెంట్ సీటుపై కన్నేసిన కామ్రేడ్లు..

Comrades Who Looked At That Parliament Seat, Comrades Looked At That Parliament Seat, Comrades Hope For That Parliament Seat, Comrades Hope For That MP Seat, Khammam MP Seat, Latest Comrades Parliament Seat News, Narayana's Hope Come True?, Comrades, Parliament Seat,MP Seat, Khammam, CPI Narayana, Koonamneni Sambasiva Rao, Mango News, Mango News Telugu, MP Seat News, Parliament News
Narayana's hope come true?, Comrades, parliament seat,MP SEAT, Khammam, CPI Narayana, Koonamneni Sambasiva Rao

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష సీపీఐ పార్టీ.. కాంగ్రెస్ పొత్తుతో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అదే జోష్‌తో తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి మరో అడుగు ముందుకేయాలని సీపీఐ భావిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని కాంగ్రెస్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో ఓ సీట్లో పోటీ చేయబోతున్నామని సీపీఐ పార్టీ సీనియర్‌ నేత స్పష్టం చేశారు. దీంతో ఈ సారి వామపక్షాల లక్ ఎలా ఉండబోతోందోనన్న చర్చ షురూ అయింది.

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ ఒక్క స్థానంలో గెలిచి సత్తా చాటింది. కొత్తగూడెం నుంచి పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందడంతో పార్టీలో జోష్ పెరిగింది. ఇప్పడు అదే ఊపుతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఒక సీటులో పోటీ చేయాలని కామ్రేడ్లు భావిస్తున్నారు.దీనిపై ఇప్పటికే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ..  తాము తెలంగాణలో ఒక చోట నుంచి బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ తమను  కలుపుకొని పోకపోవడం ఆ పార్టీకే నష్టం అని చెప్పుకొచ్చారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తమను కలుపుకొని పోవడంతోనే అధికారంలోకి వచ్చిందని.. తమను కలుపుకోకుండా వెళ్లడంతోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓడిపోయిందని నారాయణ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలతో పాటు ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లాలని ఆయన కాంగ్రెస్‌కు సూచించారు.

నిజానికి  వామపక్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంచెం గట్టిగానే పట్టు ఉంది. కొత్తగూడెంలో సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన కూనంనేని సాంబశివరావు.. కాంగ్రెస్ మద్దతుతో గెలిచారు. ఇప్పుడు లోక్ సభ సీటు విషయంలో కూడా మరోసారి ఖమ్మం జిల్లా నుంచే  ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  నారాయణ 2014లో  ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సీమాంధ్ర నాయకుడిగా మాత్రమే ఆయనను చూడటం, స్థానిక  నేత కాదన్న ముద్ర ఉండటంతో పాటు.. ఓట్లు బదలాయింపు జరగకపోవడం వంటి కారణాలతో ఆయన అప్పుడు ఓడిపోయారు. అయితే అప్పుడు కూడా కాంగ్రెస్‌తో పొత్తుతోనే  పోటీ చేసింది. కానీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు పవనాలు వీయడం, సీపీఐ పొత్తు ఫలించడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి కూడా వచ్చింది. దీంతో ఈ సారి  తమకు విజయావకాశలు ఎక్కువగా ఉండొచ్చని లెప్ట్ పార్టీలు భావిస్తున్నాయి.

తాజాగా సీపీఐ నారాయణ ప్రకటనతో.. ఆయన ఖమ్మం సీటుపైనే ఆశలు పెంచుకున్నారని.. ఈ సారీ కూడా ఆయనే పోటీలో దిగబోతున్నట్లు వామపక్ష వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలనూ ఒక సీట్లో పోటీ చేస్తామని .. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ తో కలిసే ముందుకు వెళ్తామని నారాయణ క్లారిటీ ఇచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా సన్నద్ధమవుతున్న కాంగ్రెస్.. కామ్రేడ్‌లను  పరిగణలోకి తీసుకుంటారా..? లేదా..? అన్నఅనుమానాలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + five =