తక్కువ నిద్రపోయేవారిలో ఆ ప్రమాదం ఉందట..

Sleeping Less Than 5 Hours, Less Than 5 Hours Sleeping, 5 Hours Sleeping, Sleeping 5 Hours, Sleeping Less Than 5 Hours A Day, Risk In Those Who Sleep Less,Sleep,Sleeping, Less Sleeping Nights, Less Sleeping, Less Sleep, Health News, Health News Updates, Health Tips, Mango News, Mango News Telugu
Sleeping less than 5 hours?, risk in those who sleep less,sleep,Sleeping

ప్రతి మనిషికి తిండి, నీళ్లు, నిద్ర అవసరం అని చిన్నప్పటి నుంచీ చదువుకున్నాం. అలాగే  పెద్దలు కూడా అదే మాట చెబుతూ  ఉంటారు. అయితే తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఒకటి, రెండు రోజులు ఉండొచ్చేమో కానీ నిద్రలేకపోతే మాత్రం మెదడు అంతా మొత్తం మొద్దుబారిపోయినట్లు కనిపిస్తుంది. ఒకరోజు నిద్రను కవర్ చేయడానికి మూడు, నాలుగు రోజులు అయినా పడుకోవాలని అనిపిస్తుంది.

అందుకే ప్రతీ మనిషికి 5 నుంచి 7 గంటల నిద్ర అవసరం అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే మారుతున్న లైఫ్ స్టైల్‌తో చాలామంది నిద్రను లైట్  తీసుకుంటున్నారు. 3,4 గంటలు మాత్రమే నిద్రపోయి మిగిలిన సమయాన్ని తమ కెరీర్ కోసమో.. వినోదం కోసమో ఖర్చు పెట్టేస్తున్నారు. నిజానికి ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా అవసరం.  ఎందుకంటే నిద్రలో కూడా మనిషి మెదడు రీ ఫ్రెష్ అవుతుంది. అందుకే మనిషి రోజుకు ఎంతసేపు పడుకున్నాడు.  ఎప్పుడు నిద్రపోయాడు అన్నది కూడా ముఖ్యం అంటారు డాక్టర్లు.

అయితే నిద్ర అనేది ఆ వ్యక్తుల వయస్సు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పెద్దల కంటే పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం పడుతుంది. నవజాత శిశువులకు అయితే రోజుకు 18 గంటల నిద్ర అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అదే ఒక ఏడాది  వయస్సున్న పిల్లలకు అయితే  14 గంటలు సరిపోతుంది. వయసు పెరిగిన కొద్దీ నిద్ర సమయం తగ్గిపోతుంది. చిన్నపిల్లలకు 8 నుంచి 9 గంటలు.. అదే పెద్దలకు అయితే 5 గంటల నుంచి 7 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. కానీ మారిన జీవనశైలితో ఇప్పుడు 3,4 గంటలు నిద్రపోవడం కూడా గగనం అయిపోతుంది. అయితే ఎవరైనా సరే 5గంటలకు  కంటే తక్కువ నిద్రపోతే అది ప్రమాదానికి పునాది కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.  బిజీగా ఉండే  వ్యక్తులు ఎక్కువ సమయం నిద్ర పోవడం కూడా తమ సమయాన్ని వృధా చేస్తుందని అనుకుంటారు. కానీ అధ్యయనాల ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడు, ఎంత సేపు పడుకుంటాడు అనేది కూడా ముఖ్యమే. సరిగ్గా నిద్రపోకపోతే వాళ్లు కచ్చితంగా  గుండె జబ్బులకు గురవుతారని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

అంతేకాదు నిద్రలేమి వల్ల ఊబకాయం, హై బీపీ, మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.  5 గంటలు,  అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులు స్థూలకాయంతో పాటు శారీరక దృఢత్వం తగ్గిపోయి మనిషికి నీరసం,నిస్సత్తువ ఆవహించే అవకాశాలు కూడా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర లేకపోవడం వల్ల మనిషి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి.. తగినంత నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =