దేశంలో 190 కోట్లు దాటిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపిణీ

Covid-19 Vaccination in India Cumulative Coverage Exceeds 190 Cr, Covid-19 Vaccination in India, Cumulative Coverage Exceeds 190 Cr, Covid-19 Vaccination Cumulative Coverage, Wuhan Virus Vaccination Drive, Wuhan Virus Vaccination, Wuhan Virus, Corona Vaccination Drive, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా 18 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190 కోట్లు దాటింది. మే 7, శనివారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190 కోట్లు (1,90,00,94,982) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటికి మొత్తం 2,35,96,683 సెషన్ల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు (మే 7, ఉదయం 7 గంటల వరకు):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,04,05,571
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,00,22,021
  • హెల్త్ కేర్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 49,03,039
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,84,16,489
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,75,49,440
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 78,66,824
  • 12-14 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 3,01,97,120
  • 12-14 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 93,23,185
  • 15-18 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 5,86,78,007
  • 15-18 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 4,30,37,227
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 55,60,39,061
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 48,09,83,791
  • 18-44 ఏళ్ల వయసు వారు (ప్రికాషన్ డోసు) : 2,48,003
  • 45-59 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 20,29,91,311
  • 45-59 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 18,86,56,562
  • 45-59 ఏళ్ల వయసు వారు (ప్రికాషన్ డోసు) : 7,47,262
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 12,69,17,937
  • 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు) : 11,75,56,098
  • 60 ఏళ్లు పైబడినవారు (ప్రికాషన్ డోసు) : 1,55,56,034
  • మొత్తం ప్రికాషన్ డోసుల పంపిణీ : 2,93,21,162
  • పంపిణీ చేసిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,90,00,94,982

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 7 =