జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

CS Somesh Kumar Latest, CS Somesh Kumar Latest News, CS Somesh Kumar Meets Officials, CS Somesh Kumar Press Meet, CS Somesh Kumar Review Meeting, Mango News, Republic Day, Republic Day 2021, Republic Day Celebrations, Somesh Kumar, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Review

జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుటకు విస్తృత ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నివారణ చర్యలు, కరోనా ప్రొటోకాల్ ప్రకారం చర్యలు తీసుకొని అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. సెక్యూరిటీ, ట్రాఫిక్ నిర్వహణ, బారీకేడింగ్, మెడికల్ టీమ్స్, మాస్క్, శానిటైజేషన్ కు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో డీజీపీ మహిందర్ రెడ్డి, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, సెక్రటరీ టు గవర్నర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, హైదరాబాద్ బెటాలియన్స్, టిఎస్ఎస్పి అడిషనల్ డీజీపీ అభిలాష్ బిష్త్, జాయింట్ సెక్రటరీ ప్రొటోకాల్ అర్విందర్ సింగ్, కల్నల్ భూపేంధర్ మరియు లెఫ్టినెంట్‌ కల్నల్ పవన్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =