తెలంగాణ రాష్ట్రంలో రహదారి భద్రత చర్యలపై సీఎస్ సమీక్ష

CS Somesh Kumar Held A Meeting with Officials on Road Safety at BRKR Bhavan,Mango News,Mango News Telugu,Chief Secretary Somesh KumarTelangana,Telangana Latest News,CS Somesh Kumar,CS Somesh Kumar Latest News,CS Somesh Kumar Held A Meeting with Officials,Take Measures To Minimise Road Accidents,CS Somesh Kumar Meets Officials,ORR Safety Plan, Cameras And Speed Guns And Ambulance Network On Cards,CS Somesh Kumar Stresses On Need To Minimise Road Accidents In TS,Mango News,Mango News Telugu,BRKR Bhavan,Road Safety,Chief Secretary Somesh Kumar,CS Somesh Kumar Road Safety Meeting At BRKR Bhavan,Hyderabad,New Road Safety Plan For ORR

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రహదారి భద్రత చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవలసిన అవసరముందని పేర్కొన్నారు. జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ తదితర ఇంజనీరింగ్ విభాగాలు వచ్చేనెల 15 వ తేదీలోగా ప్రమాదాల నివారణకు సంబంధించిన అవసరమైన తాత్కాలిక చర్యలను పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి డేటా సేకరణను మరింత పటిష్టంగా సేకరించడానికి జియో కో ఆర్డినేట్ తో, ఫోటో గ్రాఫ్ లతో డేటాను క్యాప్చర్ చేయడానికి అవసరమైన యాప్ ను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సరియగు సైనేజి బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

ఓఆర్ఆర్ కు సంబంధించి ఆటోమేటెడ్ పద్ధతితో కూడిన (స్పీడ్ గన్స్ కెమెరాలు) ప్రత్యేక సెక్యూరిటీ సేప్టీ ప్లాన్ ను రూపొందించి అవసరమైన ఎన్ ఫోర్స్ మెంటు చర్యలను చేపట్టాలన్నారు. ట్రామా కేసులకు తక్షణ వైద్య సహాయం అందించేలా యూనిఫైడ్ అంబులెన్స్ నెట్ వర్క్ , ట్రామా సెంటర్స్, అవసరమైన ఆసుపత్రులలాంటి అంశాలను అధ్యయనం చేయడానికై కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ కు సమర్పించడానికి అవసరమైన నివేదికను వారంలోగా తయారు చేయాలని కోరారు. ప్రమాద బాధితుల ప్రాణాల రక్షణ కోసం ఈఎంఆర్ఐ ద్వారా వాలంటీర్లకు ఆక్టీవ్ బ్లీడింగ్ కంట్రోల్ శిక్షణ పెద్ద ఎత్తున చేపట్టి విస్తృతమైన మార్పును తీసుకురావాలన్నారు. ప్రభుత్వ డ్రైవర్స్, ఇన్ స్టిట్యూషన్ డ్రైవర్లకు రహదారి భద్రత చర్యలపై మరింత అవగాహన కల్పించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + thirteen =