ఎన్నికల వేళ.. తెలుగులో మోడీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Election Time Modi Interesting Post in Telugu,Modi Interesting Post in Telugu,Election Time,Modi Interesting Post,Telangana assembly elections, pm modi, rahul gandhi, polling,Mango News,Mango News Telugu,Telangana Assembly Election 2023 Polling,Election Exit Poll Results LIVE Updates,Indian Prime Minister Narendra Modi,Narendra modi Latest News and Updates,Modi Interesting Post Latest News,Modi Interesting Post Latest Updates,Modi Interesting Post Live News
Telangana assembly elections, pm modi, rahul gandhi, polling

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ వేళ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తెలంగాణలోని సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని మోడీ పిలుపునిచ్చారు. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరారు. ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని.. సరైన నాయకుల ద్వారానే సమర్థ పాలన జరుగుతుందని మోడీ వివరించారు.

అటు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్‌లు పెట్టారు. ‘నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదరసోదరీమణులారా రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి’ అంటూ రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు.

మరోవైపు ప్రియాంక గాంధీ ‘నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా.. పిల్లలారా. మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు. అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు. జై తెలంగాణ. జై హింద్’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =