ప్లాస్మా డొనేట్ చేయండి, మెగాస్టార్ చిరంజీవి పిలుపు

Megastar Chiranjeevi Message over Covid Situation and Precautions,Mango News Telugu,Chiranjeevi About Precautions Safety Measures For Covid-19,Precautions Safety Measures For Covid Second Wave,Covid-19 Second Wave,Precautions For Covid-19,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi Speech,Chiranjeevi Live,Chiranjeevi About Covid-19,Covid-19,Latest Updates On Covid-19,Corona Virus,Telugu News,Latest Updates On Corona Virus,Coronavirus,Mango News,Megastar Chiranjeevi Message over Covid Situation,Chiranjeevi about Corona Virus Precautions,Megastar Chiranjeevi Reveals Solution For Covid,Megastar Chiranjeevi About Covid Precautions

దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్రముఖ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావొద్దని, లాక్‌డౌన్‌ సడలించిన వేళల్లో బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

కోవిడ్ పాజిటివ్ వస్తే భయపడొద్దు, వైరస్ కంటే భయమే ముందు చంపేస్తుంది: 

”అందరికి నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది ఈ వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతోంది. మన ఆత్మీయుల్లో కొందర్ని ఈ వైరస్ వలన కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతుంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ లాక్‌డౌన్‌ పెట్టారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంటి నుంచి బయటకు రాకండి. ఒక వేళ లాక్‌డౌన్‌ సడలించిన వేళల్లో బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి. వీలైతే డబుల్‌ మాస్క్‌ ధరించండి. లాక్‌డౌన్‌ లోనూ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ తర్వాత ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కోవిడ్ పాజిటివ్ అయినా దయచేసి భయపడొద్దు. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు ఇతర కుటుంబ సభ్యుల నుండి ఐసొలేట్ చేసుకుని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడండి. ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా, ఊపిరి సమస్య అనిపించినా, మరే ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్ ను సంప్రదించి, అవసరమైతే సత్వర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరండి” అని చిరంజీవి చెప్పారు.

ప్లాస్మా డొనేట్ చేయండి:

”కరోనా నుంచి కోలుకున్ననెల రోజుల తర్వాత మీలో యాంటీ బాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే కరోనా నుంచి కనీసం ఇద్దరినీ కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్లాస్మా డొనేట్ చేయండి. ఈ విపత్తు సమయంలో ఈ విషయాలు వీలైనంత మందికి చెప్పి మీ వంతు సాయం చేయండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని, మన ఊరిని తద్వారా మన దేశాన్ని రక్షించుకుందాం. దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు” అని చిరంజీవి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =