రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకే నా ఓటు: కేటీఆర్

My vote is for those who take forward the development of the state says ktr,My vote is for those who take forward,The development of the state,ktr on development of the state,Minister ktr, Ktr vote, telangana assembly elections, polling,Mango News,Mango News Telugu,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,KTR Latest News,KTR Latest Updates
Minister ktr, Ktr vote, telangana assembly elections, polling

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని.. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకే తాను ఓటు వేశానని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద పండుగ అని కేటీఆర్ అన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటింగ్‌కు రావడం లేదు.. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. విద్యావంతులంతా తప్పకుండా తమ బాధ్యతను నిర్వర్తించాలని కేటీఆర్ సూచించారు.

అటు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హార్వెస్ట్ స్కూల్లోని 250 పోలింగ్ బూత్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పువ్వాడ అజయ్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పువ్వాడ అజయ్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + thirteen =