టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ

ED conducts searches at TRS MP, ED issues summons to TRS MP Nama, ED Issues Summons To TRS MP Nama Nageswara Rao, ED raids residence office of TRS’ Nama Nageswara, ED raids TRS MP Nama Nageswara Rao, Enforcement Directorate Issues Summons to TRS MP, Enforcement Directorate Issues Summons to TRS MP Nama Nageswara Rao, Mango News, Nama Nageswara Rao, Summons to TRS MP Nama Nageswara Rao, telangana, TRS MP Nama Nageswara Rao

టీఆర్‌ఎస్ పార్టీ‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు బుధవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. జూన్ 25న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లులో పేర్కొంది. ముందుగా బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుకు సంబంధించి నామా నాగేశ్వరరావు ఇంట్లో, ఆఫీసులలోనూ, రాంకీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ల ఇళ్లలో ఇటీవలే ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల్లో భాగంగా హార్డ్ డిస్క్స్, డాక్యుమెంట్స్, కొంత నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ నిమిత్తం నామా నాగేశ్వరరావుతో పాటుగా మధుకాన్ కేసులో ఉన్న వారికీ కూడా ఈడీ తాజాగా సమన్లు పంపించినట్లు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here