దూకుడు పెంచిన బీఆర్ఎస్.. ఇద్దరు అభ్యర్థులు ఖరారు

BRS, KCR, KTR, Lok sabha elections, Vinod Kumar, Ranjith Reddy, Telangana Election 2023, Telangana Assembly election 2023, Telangana Assembly election, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Mango News, Mango News Telugu
BRS, KCR, KTR, Lok sabha elections, Vinod Kumar, Ranjith Reddy

2014 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 11 స్థానాలు దక్కించుకుంది గులాబీ పార్టీ. 2019కి వచ్చే సరికి ఆ సంఖ్య  కాస్త తగ్గింది. ఈసారి 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక 2014కి వచ్చే సరికి తెలంగాణలో అధికారమే కోల్పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలయింది. పదేళ్లుగా అధికారానికి దూరంగావున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఆ దిశగా సరికొత్త వ్యూహాలు పన్నుతోంది.

అయితే ముందు నుంచి కూడా బీఆర్ఎస్‌కు లోక్ సభ స్థానాల గెలుపు కాస్త కష్టంగానే మారింది. ఈక్రమంలో మరో మూడు నెలల్లో లోక్ సభ  ఎన్నికలు జరగనుండగా.. ఇప్పుడే కదనరంగంలోకి బీఆర్ఎస్ దూకేసింది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, అభిమానులు, కీలక నేతలతో సమావేశమై.. ఎన్నికలవేళ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై కేటీఆర్, హరీష్ రావులు చర్చలు జరుపుతున్నారు. దాదాపు సన్నాహక సమావేశాలు కూడా పూర్తికావొచ్చాయి.

ఇక హైదరాబాద్ ఎంఐఎంకు కంచుకోట. హైదరాబాద్ లోక్ సభ స్థానంపై ఎన్నో ఏళ్లుగా ఎంఐఎం జెండానే ఎగురుతోంది. అందుకే బీఆర్ఎస్ ఆ స్థానాన్ని లైట్ తీసుకుంది. మిగిలిన స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఇక సన్నాహక సమావేశాల్లో భాగంగా రెండు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఫైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేవెళ్ల లోక్ సభ స్థానానికి డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన్ను అదే స్థానం నుంచి పోటీ చేయించాలని బీఆర్ఎస్ భావిస్తోందట.

అలాగే 2019 లోక్ ‌సభ ఎన్నికల్లో వినోద్ కుమార్ బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోసారి వినోద్ కుమార్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోందట. అందుకే వచ్చే ఎన్నికల్లో వినోద్ కుమార్‌ను కరీంనగర్ నుంచి బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోందట. ప్రస్తుతానికి ఈ ఇద్దరి పేర్లను బీఆర్ఎస్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన స్థానాలకు కూడా అతి త్వరలోనే అభ్యర్థలను ఖరారు చేసి.. బరిలోకి దించాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తోందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eight =