మార్చి 15 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 7 రోజుల పాటు స‌మావేశాల నిర్వహణ

Telangana Assembly Budget Session will be Held up to March 15th, Assembly Budget Session will be Held up to March 15th, Telangana Budget Session 2022, Telangana Budget Session, TS Budget Session, 2022 Telangana Budget Session, Telangana Assembly Budget Session 2022-23, Telangana Assembly Budget Session 2022, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget, Telangana assembly budget session, Telangana Budget 2022-23, Telangana Budget 2022, Telangana Budget, Telangana, Telangana Assembly, Telangana Assembly, Telangana Assembly Session, Manog News, Manog News Telugu,

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చి 15 వరకు జరగనున్నాయి. ముందుగా తొలిరోజున శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాక సభను బుధవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సమావేశాల నిర్వహణపై అసెంబ్లీలో బీఏసీ(శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల స‌ల‌హా సంఘం) సమావేశం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, కాంగ్రెస్‌ పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.

ఈ బీఏసీ సమావేశం సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను మార్చి 15 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. మార్చి 8, 13వ తేదీల్లో సభకు సెల‌వులు ప్ర‌క‌టించారు. మార్చి 10, 11, 12, 14 తేదీల్లో బడ్జెట్ ప‌ద్దుల‌పై, మార్చి 15న ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చించనున్నారు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు మొత్తం 7 రోజుల పాటుగా కొన‌సాగ‌నున్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 2 =