ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం బాధ్యతలు స్వీకరణ

Former MP Manda Jagannadham Takes Charge as Special Representative to Telangana Govt at New Delhi, ex-MP Manda Jagannadham Takes Charge as Special Representative to Telangana Govt at New Delhi, Special Representative to Telangana Govt at New Delhi, New Delhi Telangana Govt Special Representative, Telangana Govt Special Representative, Special Representative, Manda Jagannadham Takes Charge as Special Representative to Telangana Govt, MP Manda Jagannadham Takes Charge as Special Representative to Telangana Govt at New Delhi, New Delhi, Former MP Manda Jagannadham, ex-MP Manda Jagannadham, MP Manda Jagannadham, Manda Jagannadham, New Delhi Telangana Govt Special Representative News, New Delhi Telangana Govt Special Representative Latest News, New Delhi Telangana Govt Special Representative Latest Updates, New Delhi Telangana Govt Special Representative Live Updates, Mango News, Mango News Telugu,

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, కేబినెట్ మినిస్టర్ హోదాను కల్పిస్తూ మాజీ ఎంపీ డా.మందా జగన్నాథంను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మందా జగన్నాథం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా పనిచేసి రాష్ట్రానికి విరివిగా నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రెండవ సారి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమావేశమయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి విరివిగా నిధులు వచ్చేలా ప్రయత్నిస్తానని, అదే విధంగా వివిధ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు త్వరితగతిన వచ్చేలా ప్రయత్నిస్తానని మందా జగన్నాథం తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను, పెండింగ్ ఇష్యూస్ ని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఎప్పటికప్పుడు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానన్నారు. సుహృద్భావ వాతావరణంలోనే తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని మందా జగన్నాథం పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిలో మందా జగన్నాథం రెండు సంవత్సరాల పాటుగా కొనసాగనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =