తెలంగాణ బీజేపీకి షాక్, టీఆర్ఎస్ లో చేరిన నలుగురు జీహెఛ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు

Four BJP GHMC Corporators Join in TRS in the Presence of TRS Working president KTR, BJP GHMC Corporators Join in TRS in the Presence of TRS Working president KTR, Four BJP GHMC Corporators Join in TRS, TRS Working president KTR, BJP GHMC Corporators, Four BJP GHMC Corporators, TRS Working president KTR inducts four BJP corporators, four BJP corporators, 4 Hyderabad BJP corporators switch to TRS, Four BJP corporators in GHMC along with the BJP floor leader in Tandur municipality joined the ruling TRS, BJP floor leader in Tandur, Tandur BJP floor leader joined the ruling TRS in the presence of TRS Working President KTR, Bharatiya Janata Party GHMC Corporators, GHMC BJP corporators switch to TRS News, GHMC BJP corporators switch to TRS Latest News, GHMC BJP corporators switch to TRS Latest Updates, GHMC BJP corporators switch to TRS Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. గురువారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో నలుగురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సమయంలో ఒక రోజు ముందే పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడం బీజేపీ నేతలకు ఊహించని విధంగా మారింది. రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికీ మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

జూన్ 7వ తేదీన 47 మంది జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం, పార్టీని బలోపేతం చేయడంపై వారికీ ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. కాగా జూలై 2న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ రానుండగా, ఒకరోజు ముందే నలుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్​లో చేరడం చర్చనీయాంశమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here