రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల‌ భర్తీ, నేటి నుంచే నోటిఫికేష‌న్లు జారీ : సీఎం కేసీఆర్

CM KCR Announces Mega Recruitment Govt will Release Notifications for 80039 Job Vacancies, CM KCR Announces Mega Recruitment, Mega Recruitment, Telangana Govt Announces Mega Recruitment, Govt will Release Notifications for 80039 Job Vacancies, 80039 Job Vacancies, Telangana Govt will Release Notifications for 80039 Job Vacancies, CM KCR Announces Mega Recruitment On Job Vacancies, CM KCR announces mega recruitment process for 91142 jobs, Telangana government will take up direct recruitment for 80039 vacancies, direct recruitment for 80039 vacancies, 80039 vacancies, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో భాగంగా బ‌డ్జెట్‌ పై చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ముఖ్యమైనవని, అందుకోసమే రాష్ట్ర ఉద్యమం జరిగిందని చెప్పారు. నీళ్లు, నిధులు ఒక్కొక్క‌టిగా సాకారం చేసుకుంటూ వచ్చామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలు టాస్క్ అని, గేమ్ కాదన్నారు.

రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల‌ భర్తీ, నేటి నుంచే నోటిఫికేష‌న్లు జారీ:

రాష్ట్రంలో లక్షా 50 వేలు ఉద్యోగాలు నోటిఫై చేశామని, ఇప్ప‌టికే వివిధ శాఖ‌ల్లో 1, 33, 942 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 22 వేల ఉద్యోగాలకు ప్రక్రియ నడుస్తుందన్నారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చామన్నారు. ఆంధ్రతో నెలకున్న షెడ్యూల్ 9, 10 కూడా పరిష్కరమైతే అక్కడా కూడా అవకాశాలు ఏర్పాటు అవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 91,142 ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని, వీటిపై నేటి నుంచే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 91,142 ఖాళీల్లో ఉన్న 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను అధికారికంగా రెగ్యులైజషన్ చేస్తునట్టు ప్రకటించారు. మిగిలిన 80,039 పోస్టులను భ‌ర్తీ చేయనున్నామని, తక్షణమే నేటి నుంచే నోటిఫికేష‌న్లు వెలువడతాయని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల వివరాలు:

  • గ్రూప్‌ 1 – 503
  • గ్రూప్‌ 2 – 582
  • గ్రూప్‌ 3 – 1,373
  • గ్రూప్‌ 4 – 9168

క్యాడర్ వారీగా ఖాళీలు:

  • జిల్లాల్లో పోస్టులు – 39,829
  • జోన్లలో పోస్టులు – 18,866
  • మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
  • సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో పోస్టులు – 8,174

జిల్లాల వారీగా ఖాళీలు (39,829):

  1. హైదరాబాద్ – 5,268
  2. నిజామాబాద్ – 1,976
  3. మేడ్చల్ మల్కాజ్‌గిరి – 1,769
  4. రంగారెడ్డి – 1,561
  5. కరీంనగర్ – 1,465
  6. నల్లగొండ – 1,398
  7. కామారెడ్డి – 1,340
  8. ఖమ్మం – 1,340
  9. భద్రాద్రి కొత్తగూడెం – 1,316
  10. నాగర్‌కర్నూల్ – 1,257
  11. సంగారెడ్డి – 1,243
  12. మహబూబ్‌నగర్ – 1,213
  13. ఆదిలాబాద్ – 1,193
  14. సిద్దిపేట – 1,178
  15. మహబూబాబాద్ – 1,172
  16. హనుమకొండ – 1,157
  17. మెదక్ – 1,149
  18. జగిత్యాల – 1,063
  19. మంచిర్యాల – 1,025
  20. యాదాద్రి భువనగిరి – 1,010
  21. జయశంకర్ భూపాలపల్లి – 918
  22. నిర్మల్ – 876
  23. వరంగల్ – 842
  24. కుమ్రం భీం ఆసీఫాబాద్ – 825
  25. పెద్దపల్లి – 800
  26. జనగాం – 760
  27. నారాయణపేట్ – 741
  28. వికారాబాద్ – 738
  29. సూర్యాపేట – 719
  30. ములుగు – 696
  31. జోగులాంబ గద్వాల – 662
  32. రాజన్న సిరిసిల్లా – 601
  33. వనపర్తి – 556

జోన్లు వారీగా ఖాళీల వివరాలు (18,866):

  • కాళేశ్వరం జోన్‌ – 1,630
  • బాసర జోన్‌ – 2,328
  • రాజన్న జోన్‌ – 2,403
  • భద్రాద్రి జోన్‌ – 2,858
  • యాదాద్రి జోన్‌ – 2,160
  • చార్మినార్ జోన్‌ – 5,297
  • జోగులాంబ జోన్‌ – 2,190

మల్టీజోన్లు ఖాళీల వివరాలు (13,170):

  • మల్టీజోన్ 1 – 6,800
  • మల్టీజోన్ 2 – 6,370

శాఖల ఖాళీల వివరాలు (80,039):

  1. హోం శాఖ – 18,334
  2. సెకండరీ ఎడ్యుకేషన్ – 13,086
  3. హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ – 12,755
  4. హయ్యర్ ఎడ్యుకేషన్ – 7,878
  5. బీసీల సంక్షేమం – 4,311
  6. రెవెన్యూ శాఖ – 3,560
  7. ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ – 2,879
  8. నీటిపారుదల శాఖ – 2,692
  9. ఎస్టీ వెల్ఫేర్ – 2,399
  10. మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
  11. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ – 1,598
  12. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ – 1,455
  13. లేబర్, ఎంప్లాయీమెంట్ – 1,221
  14. ఆర్థిక శాఖ – 1,146
  15. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ – 895
  16. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ – 859
  17. అగ్రికల్చర్, కో-ఆపరేషన్ – 801
  18. రవాణా, రోడ్లు, భవనాల శాఖ – 563
  19. న్యాయశాఖ – 386
  20. పశుపోషణ, మత్స్య విభాగం – 353
  21. జనరల్ అడ్మినిస్ట్రేషన్ – 343
  22. ఇండస్ట్రీస్, కామర్స్ – 233
  23. యూత్, టూరిజం, కల్చర్ – 184
  24. ప్లానింగ్ – 136
  25. ఫుడ్, సివిల్ సప్లయిస్ – 106
  26. లెజిస్లేచర్ – 25
  27. ఎనర్జీ – 16
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − three =