సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు రాజ్ భవన్ లో స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

CJI NV Ramana On Three Day Visit To Hyderabad, CJI NV Ramana On Three Day Visit To Hyderabad Gets Warm Welcome From CM KCR, CJI NV Ramana Visit To Hyderabad, CJI Ramana accorded warm welcome in Hyderabad, CJI Ramana accorded warm welcome on three-day visit, CJI Ramana arrives in Hyderabad, Grand welcome to CJI NV Ramana in Hyderabad, Justice NV Ramana India, Mango News, NV Ramana

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. అనంతరం రాజ్ భవన్ లో ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీజేఐ ఎన్వీ రమణ రాజ్‌భవన్‌ అతిథిగృహంలో మూడు రోజులపాటు బస చేయనున్నారు.

సీజేఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ మొదటిసారిగా హైదరాబాద్‌ కు వచ్చారు. ముందుగా హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నగరమేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కె.కేశవ రావు, సురేష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్సీలు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకెపూడి గాంధీ, రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, కల్వకుర్తి శాసనసభ్యులు జయ్ పాల్ యాదవ్, షాద్ నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, తదితరులు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + twelve =