ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Chief Ministers of Both Telugu States Extends Wishes For Sri Rama Navami To The People, Chief Ministers of Both Telugu States Extends Greetings For Sri Rama Navami To The People, Sri Rama Navami Festival News, Sri Rama Navami Festival Latest News, Sri Rama Navami Festival Latest Updates, Sri Rama Navami Festival Live Updates, AP CM YS Jagan Mohan Reddy Sri Rama Navami Festival Greetings, AP CM YS Jagan Mohan Reddy Sri Rama Navami Festival Wishes, Telangana CM KCR Sri Rama Navami Festival Greetings, Telangana CM KCR Sri Rama Navami Festival Wishes, Sri Rama Navami Festival, Sri Rama Navami Festival Greetings, Sri Rama Navami Festival Wishes, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Telangana, Mango News, Mango News Telugu,

శ్రీరామ నవమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం కష్టాలు ఎదురైనా వెరవక విలువలను ఆచరించి, ధర్మాన్ని కాపాడిన మహనీయుడని తెలిపారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా.. ప్రజలందరూ పండుగను ఉత్సవంలా చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆదర్శదంపతులు సీతారాములని, వారి జీవితం భవిష్యత్‌ తరాలకు సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో భద్రాచలం ఆలయంలో, ఆంధ్రాలో ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు రెండు రాష్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయని ప్రతిఒక్కరూ వీటిలో పాల్గొనాలని సూచించారు. తెలుగు ప్రజలందరూ ఇంటింటా శ్రీరామనవమి పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని, సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు సీఎం‌ జగన్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 19 =