హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరోనా‌ వ్యాక్సిన్‌ తీసుకున్న మంత్రి ఈటల

Etala Rajender, Etala Rajender Took Coronavirus Vaccine, Etala Rajender Took COVID Vaccine, Etala Rajender Took COVID-19 Vaccine, Etala Rajender Took First Dose of COVID-19 Vaccine, Etala Rajender Took First Dose of COVID-19 Vaccine at Huzurabad Area Hospital, Health Minister Etala Rajender, Huzurabad, Huzurabad Area Hospital, Minister Etala Rajender, Minister Etala Rajender Took First Dose of COVID-19 Vaccine, Telangana Health Minister, Telangana Health Minister Etala Rajender

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఆయన మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వైద్య సిబ్బందికి ఇప్పటికే మొదటి, రెండవ డోస్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ అందించడం జరిగిందని చెప్పారు. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు రెండో విడతలో 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి నేటి నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైందని చెప్పారు.

త్వరలో అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ పంపిణీ అందుబాటులోకి వస్తుందని అన్నారు. అలాగే అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్క డోస్‌ కరోనా వ్యాక్సిన్ ధర రూ.250 గా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ లేదని, వ్యాక్సిన్ పంపిణీ ద్వారా మరింత తగ్గుముఖం పడుతుందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ‌పై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అర్హులైన వారంతా రిజిస్ట్రేషన్‌ చేసుకుని అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + one =