రేపు ఉప్పల్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలివన్డే.. ట్రాఫిక్‌ ఆంక్షలు సహా కీలక సూచనలు చేసిన రాచకొండ సీపీ చౌహాన్‌

Hyderabad Rachakonda CP Chauhan Announces Traffic Restrictions For Tomorrow During 1st ODI Between India and New Zealand,Tomorrow Will Be The First One,Between India And New Zealand In Uppal,Rachakonda Cp Chauhan, Gave Key Instructions,Including Traffic Restrictions,Mango News,Mango News Telugu,India Vs New Zealand Schedule,India Vs New Zealand T20,India Vs New Zealand Test,India Vs New Zealand Hyderabad Tickets,India Vs New Zealand Upcoming Match,India Vs New Zealand Live,India Vs New Zealand Live Score,India Vs New Zealand 2023,India Vs New Zealand Wtc Final,India Vs New Zealand Live Score 2023,India Vs New Zealand 2Nd Test 2023,India Vs New Zealand Test 2023,India Vs New Zealand Highlights,India A Vs New Zealand A Live Score Today,India Legends Vs New Zealand Legends,Indian Vs New Zealand,India A Vs New Zealand A Today Match

బుధవారం హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలివన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ మంగళవారం దీనికి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది వరకు కొనసాగుతాయని వెల్లడించారు. సోమాజిగూడ నుంచి రాజీవ్ గాంధీ స్టేడియం వరకు సాగే రహదారిలో ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపిన ఆయన.. గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్‌ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

ఇక ఈ మ్యాచ్‌కు మొత్తం 2,500 మంది సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ చౌహాన్‌ తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని, స్టేడియం లోనికి సెల్‌ఫోన్‌ మినహా ఇతర పరికరాలేవీ అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రధానంగా పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్న వారు మాత్రమే స్టేడియానికి రావాలని, ఎవరైనా అత్యుత్సాహంతో మైదానంలోకి వెళ్లి క్రికెటర్లకు అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామని, అలాగే మహిళల భద్రత కోసం 40 మందితో షీ టీమ్‌లు ఏర్పాటు చేశామని వివరించారు. అంతేకాకుండా క్రికెట్‌ బెట్టింగ్‌, బ్లాక్‌ టికెట్లపై ప్రత్యేక నిఘా పెట్టామని, మ్యాచ్‌ టికెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్‌ చౌహాన్‌ హెచ్చరికలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here