నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ విందు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad Traffic Police Announces Restrictions During Christmas Celebrations in LB Stadium Today,Christmas Dinner At Lb Stadium,Telangana Government Today,Traffic Restrictions In Hyderabad,Mango News,Mango News Telugu,Christmas Dinner Event,Christmas Dinner at LB Stadium,Telangana Govt Christmas Dinner,Mango News,Mango News Telugu,Minister Koppula Eshwar,Christmas Celebrations,Dinner For Christians At Lb Stadium,Mango News,Mango News Telugu,Telnagana Government Intention,People Celebrate The Festivals Happily, Minister Talasani Presented Christmas Gifts,Cm Kcr News And Live Updates,Telangana CM KCR

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో బుధవారం క్రిస్మస్‌ విందు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక సీఎం విందు కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల కోసం పోలీసులు లైటింగ్ పాయింట్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ స్థలాలను అందుబాటులో ఉంచామని, ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారు వాహనాలను పార్క్‌ చేయాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీ జంక్షన్ వద్ద మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుందని, వాహనదారులు గమనించి పోలీసులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

  • ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వైపు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వారిని నాంపల్లి, చాపల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.
  • అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి చాపల్‌రోడ్డు,స్టేషన్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.
  • బషీర్‌బాగ్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు రూట్‌లో వచ్చే వాహనాలను కింగ్‌ కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రోడ్డులోకి పంపిస్తారు.
  • సుజాత స్కూల్‌ లైన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ బిల్డింగ్‌ వైపు వాహనాలను సుజాత స్కూల్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి స్టేషన్‌ రోడ్డు మీదుగా ఆయా ప్రాంతాలకు మళ్లిస్తారు.
  • అలాగే ఆర్టీసీ బస్సులను రవీంద్రభారతి నుంచి అబిడ్స్‌ వైపు కాకుండా.. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద నుంచి నాంపల్లి స్టేషన్‌ రోడ్డు మీదుగా ప్రయాణించాలి.

వాహనదారులు ఈ జంక్షన్ల నుంచి రాకపోకలు సాగించకపోవడం మంచిది..

పోలీస్‌ కంట్రోల్‌ రూం, బషీర్‌ బాగ్‌, బీజేఆర్‌ విగ్రహం సర్కిల్‌, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్‌ సర్కిల్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, నాంపల్లి, కేఎల్‌కే బిల్డింగ్‌, లిబర్టీ, రవీంద్ర భారతి, లక్డీకపూల్‌, ఇక్బాల్‌ మినార్‌, హిమాయత్‌నగర్‌, అసెంబ్లీ, ఎం.జే.మార్కెట్‌, హైదర్‌గూడ జంక్షన్లలో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + twelve =