హుజురాబాద్ ఓటర్లు ఇచ్చే తీర్పు అదేనా?

Is it the candidate of that party who will win in Huzurabad,Is it the candidate of that party,who will win in Huzurabad,Politics Of Huzurabad, Koushik Reddy, Etela, Bjp, Brs, Congress, Etela Rajender, Gajwel, Huzurabad, Karimnagar, Vodithala Pranav Babu, Padi Koushik Reddy,Karimnagar,Mango News,Mango News Telugu,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Huzurabad Latest News,Huzurabad Latest Updates
Politics Of Huzurabad, Koushik Reddy, Etela, Bjp, Brs, Congress, Etela Rajender, Gajwel, Huzurabad, Karimnagar, Vodithala Pranav Babu, Padi Koushik Reddy,Karimnagar

ఏ ఎన్నికలు జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలిచే నియోజకవర్గం ఏదంటే అది.. హుజురాబాద్ నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్‌తో, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ పోటీ పడుతున్నాయి. దీంతో అలాంటి నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు. ప్రజలంతా ఏ వైపు ఉన్నారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో  మొత్తం 2,3, 872 ఓట్లు ఉన్నాయి.అలాంటి హుజురాబాద్‌లో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి ఒడితల ప్రణవ్ బాబు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు లీడర్లు కూడా రాజకీయంగా  బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లే.ఇందులో ఈటల రాజేందర్ అక్కడ బలమైన లీడర్‌గా ఎన్నో ఏళ్లుగా గుర్తింపు పొందారు. ఇప్పటికే ఈటల మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం నాలుగోసారి ఇక్కడి నుంచి బరిలో దిగారు.

ఇక పాడి కౌశిక్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీలో బలమైన లీడర్‌గా గుర్తింపు పొందారు. చాలాసార్లు ఈటల రాజేందర్‌పై పోటీ చేసి కొద్ధిపాటి ఓట్ల తేడాలో ఓడిపోయారు.ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి బలమైన లీడర్‌గా గుర్తింపు పొంది ఈ ఎన్నికల బరిలోకి దిగారు.

మరోవైసే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒడితల ప్రణవ్ బాబు బరిలో ఉన్నారు. ప్రణవ్ బాబు తాతయ్య ఓడితల రాజేశ్వరరావు  హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఆ ప్రాంత ప్రజలకు ఆయనో మంచి మనిషిగా గుర్తింపు ఉంది. అలా ముగ్గురు బలమైన లీడర్లు హోరాహోరీగా తలపడుతున్నారు.మరోవైపు ఈటల రాజేందర్ గజ్వేల్, హుజురాబాద్  రెండు స్థానాల్లో పోటీలో ఉన్నారు.

ఈ సారి సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్‌ నుంచే పోటికి దిగడంతో..ఈటల  రాజేందర్ ఎక్కువగా ఆ నియోజకవర్గం పైనే  దృష్టి పెట్టారు. దీంతో హుజురాబాద్‌లో ఈటలకు కాస్త గ్రాఫ్ తగ్గినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో   కాంగ్రెస్‌లో బలమైన లీడర్‌ అయిన పాడి కౌశిక్ రెడ్డి  బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవడంతో.. కాంగ్రెస్ కేడర్ ఆయనపై కాస్త గుర్రు మీద ఉంది. ఇదే సమయంలో  ఈ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ  ప్రణవ్ బాబు.. పాత కేడర్‌ను తనవైపు తిప్పుకున్నట్టు తెలుస్తోంది.  లీడర్ల మధ్య హోరాహోరీ  పోటీ ఉండటంతో ఓటర్ల మనసును  ఎవరు గెలుచుకుంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =