ఆ పని చేస్తే బెయిల్ పక్కా.. బాబుకు అంబటి ఉచిత సలహా

If You Do That You Will Be Bailed Free Advice to Babu,If You Do That You Will Be Bailed,Free Advice to Babu,Mango News,Mango News Telugu,chandrababu naidu, tdp, skill development scam case, ap politics, chandrababu arrest, ambati rambabu,chandrababu naidu Latest News,chandrababu naidu Latest Updates,chandrababu naidu Live News,skill development scam case Latest News,skill development scam case Latest Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
chandrababu naidu, tdp, skill development scam case, ap politics, chandrababu arrest, ambati rambabu

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు.. ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. బయటకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఒక్క ప్రయత్నం కూడా వర్కౌంట్ కావడం లేదు. ముందు నుంచి కూడా చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటు చంద్రబాబు కూడా తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. తనను జైలులోనే అంతమొందించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఓ ఖైదీ పెన్ కెమెరా పట్టుకొని జైలులో తిరుగుతున్నారని చంద్రబాబు జడ్జికి వివరించారు. వామపక్ష తీవ్రవాదులు తన హత్యకు ప్లాన్ చేశారని.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎస్పీకి లేఖ రాశారని పేర్కొన్నారు. తన కదలికలను తెలుసుకునేందుకు జైలు ప్రధాన ద్వారం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారని చెప్పారు. కొందరు ఖైదీల వల్ల తన భద్రతకు ముప్పు ఉందని జడ్జికి రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

అయితే చంద్రబాబు జడ్జికి లేఖ రాయడంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వాదనలు గందరగోళంగా ఉన్నాయని అంబటి విమర్శించారు. అదే సమయంలో చంద్రబాబుకు బెయిల్ వచ్చేందుకు అంబటి ఓ ఐడియా ఇచ్చారు. విదేశాలకు పంపించిన చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్‌ను వెనక్కి రప్పిస్తే.. వెంటనే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ ఇండియా నుంచి వస్తే.. చంద్రబాబు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంబటి వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =