ఆగం చేసిన కాంగ్రెస్ కావాలా?.. అభివృద్ధి చేసిన కేసీఆర్ కావాలా?

minister ktr, ktr comments, telangana politics, congress, karnataka congress, telangana assembly elections
minister ktr, ktr comments, telangana politics, congress, karnataka congress, telangana assembly elections

అసెంబ్లీ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. అందరికంటే ముందే 115 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలో కూడా ముందంజలోనే దూసుకెళ్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక దశ ప్రచారం పూర్తి చేయగా.. అటు గులాబీ బాస్ వరుసగా నియోజవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూనే..  ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు.

అటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా క్షణం తీరిక లేకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ అనారోగ్యం బారిన పడడంతో.. పార్టీ బాధ్యతలను బుజాన ఎత్తుకున్నారు. ఇప్పుడు కూడా ఓవైపు పార్టీ మీటింగ్‌లు.. మరోవైపు బహిరంగ సభలు, ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు.  ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై మంత్రి కేటీఆర్ భగ్గుమన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో కాంగ్రెస్‌ను విమర్శిస్తూ.. రైతులను ఉద్దేశించి కేటీఆర్ పోస్ట్ పెట్టారు. కర్ణాటకలో రైతులకు కేవలం 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆ కరెంట్ కావాలా? లేక సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల విద్యుత్ కావాలా? లేక రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 3 గంటల విద్యుత్ కావలో రైతులే తేల్చుకోవాలని కేటీఆర్ సూచించారు.

ఆరు దశాబ్దాలుగా ఆగం చేసిన కాంగ్రెస్ కావాలా?.. రైతు బంధు, రైతు భీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ కావాలో తేల్చుకోమన్నారు. నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలా? వద్దా? అనేది రైతులే తేల్చుకోవాలని పోస్టు పెట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =