ఓటమి తర్వాత ఫస్ట్ టైం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

KCR met BRS MLAs for the first time after the defeat,KCR Met BRS MLAs For the First Time,First Time after the Defeat,kcr, kcr farmhouse, BRS MLAs, telangana politics,Mango News,Mango News Telugu,BRS Party Chief KCR,BRS MLAs Latest News,BRS MLAs Latest Updates,Telangana election results,BRS Leaders at Farmhouse,Telangana Assembly Election,Telangana Elections Latest Updates,Telangana Latest News And Updates
kcr, kcr farmhouse, brs mlas, telangana politics

తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ సర్కార్ పదేళ్ల తర్వాత గద్దె దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసైకి పంపించారు. ఆ తర్వాత ప్రగతి భవన్‌ను వీడిన కేసీఆర్.. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు. అదే రోజున కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి తమ ఓటమిని అంగీకరించారు. ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు.

అయితే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కి వెళ్లిన తర్వాత తొలిసారి బయటికి కనిపించారు. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఓడిన నేతలు, ఎమ్మెల్సీలు అంతా సోమవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. అయితే ఫామ్‌హౌస్‌లో  ఏం జరిగింది అనే విషయం మాత్రం బయటకు రాలేదు. కానీ కేసీఆర్ తమ నేతలతో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం బయట హల్ చల్ చేస్తున్నాయి. ఓటమిపై కేసీఆర్ విచారం వ్యక్తం చేసినప్పటికీ.. రాబోయే రోజుల్లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజల తీర్పును గౌరవిద్దామని కేసీఆర్ తమ పార్టీ నాయకులతో అన్నారట. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు తమ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజల తీర్పుతో హుందాగా ముందే తప్పుకున్నామని చెప్పారట. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని..  కొత్త సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత ఏమి జరుగుతుందో చూద్దామని అన్నారట. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోపు కొత్త ప్రభుత్వానికి పరీక్షలు ఎదురవుతాయని అన్నారట. అలాగే త్వరలో తెలంగాణ భవన్‌లో సమావేశమై.. ఎన్నికల ఫలితాలపై సమీక్షిద్దామని నేతలతో చెప్పారట. మరి కేసీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు..?.. ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది..? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + six =