హైదరాబాద్ మెట్రో : చివరి మెట్రో రైలు రాత్రి 9.45 గంటలకు ప్రారంభం

Hyderabad Metro Rail Service, Hyderabad Metro Rail timings rescheduled, Hyderabad metro timings change as Telangana, Hyderabad Metro timings rescheduled due to Covid, Hyderabad Metro timings rescheduled due to Covid lockdown, Hyderabad Metro to reschedule timings, Lockdown Extension, Mango News, Metro timings rescheduled, Timings of Hyderabad Metro Rail Service Rescheduled, Timings of Hyderabad Metro Rail Service Rescheduled From Today

హైద‌రాబాద్ మెట్రో రైలు స‌మ‌యాల్లో మరోసారి స్వల్ప మార్పులు చేయబడ్డాయి. ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేస్తూ ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 2, శుక్రవారం నుంచి నగరంలోని టెర్మినల్ మెట్రో స్టేషన్స్ నుంచి మొదటి రైలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక చివరి మెట్రో రైలు రాత్రి 9.45 గంటలకు ప్రారంభమవుతుందని, ఆ మెట్రో రైళ్లు రాత్రి 10:45 గంట‌లకు డెస్టినేషన్ కు చేరుకుంటాయని తెలిపారు. ముందుగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం మెట్రో రైలు సర్వీసులను ఉదయం 7 గంటలకు ప్రారంభించి రాత్రి 9 గంటలకు చివరి రైలు బయలుదేరేలా నడిపారు.

తాజాగా రాత్రి సమయంలో విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉండేలా చివరి మెట్రో రైలు రాత్రి 9 గంటలకు కాకుండా, మరో 45 నిమిషాలు పెంచుతూ 9.45 గంటలకు బయలుదేరేలా స్వల్ప మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రతి ఒక్కరి భద్రతా దృష్ట్యా ప్రయాణికులంతా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, థర్మల్ స్క్రీనింగ్ మరియు ఇతర అన్ని కోవిడ్ నిబంధనలను పాటించాలని మెట్రో అధికారులు సూచించారు. అలాగే ప్రయాణికులంతా సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =