కుటుంబ పాలన ట్యాగ్ తొలిగిపోయేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్

KCR, Kavitha, Kalvakuntla family, brs,BRS government,MLC Kavitha,YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana News,Mango News Telugu,Mango News
KCR, Kavitha, Kalvakuntla family, brs

కుటుంబ పాలన.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గట్టిగా వినిపించిన మాట. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఎమ్మెల్యేలుగా ఉండడంతో పాటు కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరించడం.. కవిత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో బీఆర్ఎస్‌కు కుటుంబ పాలన ముద్ర అంటుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు కుటుంబ పాలన ట్యాగ్‌ను అప్పటి ప్రతిపక్షాలు దివ్యాస్త్రంగా వాడుకున్నాయి.  తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని.. కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించాయి. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కుటుంబ పాలన అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గద్దె దిగిపోవడానికి కుటుంబ పాలన ముద్ర కూడా ఒక కారణమనే వాదన ఉంది.

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లోనైనా తమ హవా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమయింది. అభ్యర్థుల విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.  జల్లెడ పట్టిమరీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఎన్నికలకు ముందే కుటుంబ పాలన ముద్రను తొలగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాలు రచిస్తున్నారు.

ఇందుకోసం తన కూతురు కవితను దూరం పెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారట. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురం అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా కవిత అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ కవిత విషయంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈసారి లోక్ సభ టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలా చేయడం వల్ల కుటుంబ పాలన ముద్ర ఎంతో కొంత అయినా దూరం అవుతుందని కేసీఆర్ అనుకుంటున్నారట.

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. లోక్ సభ ఎన్నికల వరకు అన్నింటిని సరిదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ముందుగా ఇంటి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే కవితకు టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్ నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమయినప్పటికీ ఇది సంచలన నిర్ణయమేనని విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + one =