కోకాపేట భూముల వేలంలో శివాలయం భూములు..

Telangana Khanapur Villagers Question The Sale of Temple Lands in Kokapet Auction,Telangana Khanapur Villagers Question,The Sale of Temple Lands in Kokapet,Kokapet Auction,Lands in Kokapet Auction,Telangana Khanapur Villagers,Mango News,Mango News Telugu,Shiva Temple Lands, Kokapet Land, Auction, Shiva, Temple Lands, Kokapet, Land Auction,Kokapet Auction Latest News,Kokapet Auction Latest Updates,Kokapet Auction Live News,Khanapur Villagers Latest News,Khanapur Villagers Latest Updates,Khanapur Villagers Live News,Temple Lands Auction News Today,Telangana Khanapur Latest News,Sale of Temple Lands Live News

మొన్నటి వరకూ కాస్త అటూ ఇటూగా ఉన్న హైదరాబాద్ రియల్ భూమ్.. కోకాపేట భూముల వేలంతో కాకమీదకు వెళ్లిపోయింది. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోయే ధర పలికి భూమిని బంగారంగా మార్చేసింది. ఆ ఒక్క వేలం పాట మొత్తం హైదరాబాద్ భూముల కోసం రియల్టర్లు పరుగులు పెట్టేలా చేసింది.

అవును హైదరాబాద్‌ శివారులోని భూములకు ఈ మధ్య మంచి గిరాకీ పెరిగింది. కోకాపేట ఇచ్చిన ఊపుతో తెలంగాణ ప్రభుత్వం..సిటీ చుట్టుపక్కల భూములను అమ్ముకుంటూ భారీగా నిధులను సేకరించుకుంటోంది. ఆ మధ్య కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరం రూ. వందకోట్ల పైగా అమ్ముడుపోవడంతో ప్రభుత్వమే షాక్‌కు గురయింది. ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. అప్పుడు అలా వేలం వేసిన భూముల్లో దేవుడి మాన్యాలు ఉన్నాయంటూ.. గండిపేట మండలం ఖానాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు. ఖానాపూర్‌కి చెందిన పురాతన శివాలయానికి చెందిన భూమి.. నియోపొలీస్ భూముల దగ్గరలో వుంది. అయితే ఈ మధ్య నియోపొలీస్ భూముల వేలంలో.. ఆ భూములతో పాటు దేవాలయ భూమిని కూడా వేలం వేసేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అప్పుడు ఆన్ లైన్ వేలం పాటలో తమ గ్రామానికి చెందిన దేవుడి భూమి ఉన్నట్లు తెలియదని చెబుతున్నారు. అప్పుడు దేవాలయ భూమిని వేలం పాటలో దక్కించుకున్న సంస్థ.. ఇప్పుడు ఆ భూమిని చదును చేస్తుండటంతో ఈ విషయం తమకు తెలిసిందని ఖానాపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఖానాపూర్ గ్రామానికి చెందిన శివాలయం భూమిని.. అక్రమంగా అమ్ముకుందని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ ఆలయ భూమిని ఎలా రక్షించుకుంటామని.. దాని కోసం తమ పోరాటం కొనసాగిస్తామని ఖానాపూర్ వాసులు అంటున్నారు. ఈ మధ్య నియోపొలిస్‌ లే అవుట్‌‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో డెవెలప్మెంట్ చేసిన ఏడు ప్లాట్లను తెలంగాణ సర్కార్ వేలం వేసింది. అప్పుడు కోకాపేట భూములు రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికి.. అత్య‌ధికంగా ఎక‌రం భూమి ధ‌ర రూ. 100.75 కోట్లు ప‌లికి అందరినీ షాక్ గురయ్యేలా చేసింది.

అలా కోకాపేట భూముల వేలం ద్వారా కేసీఆర్ ప్ర‌భుత్వానికి రూ.3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వేలంలో అత్య‌ధికంగా ఎక‌రం భూమి ధర రూ. 100.75 కోట్లు ప‌లుకగా.. అత్య‌ల్పంగా రూ. 67.25 కోట్లు ధర ప‌లికింది. ఎక‌రం భూమి స‌గ‌టున రూ.73.23 కోట్లు ప‌లికింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =