సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రానికి 10 ఎకరాల భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy Writes to CM KCR to Provide 10 Acre Land for to set up Regional Centre of Sangeet Natak Akademi at Hyderabad,Kishan Reddy Writes to CM KCR,Kishan Reddy Writes to Provide 10 Acre Land,Regional Centre of Sangeet Natak Akademi,Sangeet Natak Akademi at Hyderabad,Kishan Reddy Writes to CM KCR For Sangeet Natak Akademi,Mango News,Mango News Telugu,Telangana Latest News,Telangana Latest Updates,Hyderabad News,Telangana Live News Today

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప, విభిన్న సంస్కృతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి, విస్తృతమైన ప్రచారం కల్పించటానికి వీలుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్న సంగీతనాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రానికి 10 ఎకరాల భూమిని కేటాయించాలని సీఎం కేసీఆర్ ను లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. సంగీతం, జానపద మరియు గిరిజన కళలతో కూడిన తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంగీతనాటక అకాడెమీ ప్రత్యేకంగా ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. సీఎం సహకారం కోసం ఎదురు చూస్తున్నానని, వెంటనే పని ప్రారంభించవచ్చుని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు రాసిన లేఖను జత చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fifteen =