ఏపీ, తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌

AP and Telangana MLC Elections Counting Begins,AP MLC Elections,Telangana MLC Elections,AP and Telangana MLC Counting Begins,MLC Elections Counting Begins,Mango News,Mango News Telugu,MLC Elections Polling,MLC Graduates' Elections Voting,Members of Legislative Council,MLC Elections 2023,MLC Elections,Mlc Elections Results,MLC Elections Results Declaration,AP MLC Elections Result 2023 Live,Telangana MLC Election Result Live

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. కాగా ఏపీలో 3 గ్రాడ్యుయేట్‌, 2 టీచర్ ఎమ్మెల్సీ ప్థానాలు సహా మరో 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్‌ జరుగనుండగా.. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే హైదరాబాద్‌ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ సీటు కోసం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్‌ జరుగుతోంది. ఏపీలోని కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది పోటీ చేస్తుండగా.. విశాఖ గ్రాడ్యుయేట్‌ స్థానంలో 37 మంది అభ్యర్థులు ఉన్నారు. అలాగే ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీ పడుతుండగా.. కడప, అనంతపురం, కర్నూలు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది పోటీలో ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానిక సంస్థల స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా పూర్తిస్థాయి ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =