మే 12 నుండి మే 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపివేత : సీఎస్ సోమేశ్ కుమార్

Lockdown in Telangana : Dharani Portal Registrations Stopped Till May 21st,Telangana,No Dharani transactions till May 21,Mango News,Mango News Telugu,No land registrations through Dharani portal,Telangana Lockdown,Dharani Portal Registrations Cancelled,LockDown In Telangana,Dharani Portal News,Dharani Portal Registrations Stopped,Dharani Portal Registrations,Dharani Portal Registrations Stopped Till May 21st,Dharani Portal News Latest,Dharani Portal Latest Updates,Dharani Portal Registrations Update,Telangana Dharani Portal Registrations,Telangana Dharani Portal,Dharani Portal Registration In Telangana,Hyderabad,Registration Of Dharani Portal Stopped Till May 21st,CS Somesh Kumar Press Meet,CS Somesh Kumar

రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబందనల వలన మే 12, 2021 నుండి మే 21, 2021 తేది వరకు మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్ లుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ల వద్ద ధరణి ద్వారా నిర్వహించే భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు జరుగవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి/సిసిఎల్ఎ సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మే 12 నుండి 21 వరకు రిజిస్ట్రేషన్ల కోసం ధరణి ద్వారా స్లాట్ లు బుక్ చేసుకున్న వారి స్లాట్ లను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. స్లాట్ ల బుకింగ్ కై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చార్జీలు చెల్లుబాటు అవుతాయని, రీషెడ్యూల్ సమయంలో వాటిని జమ చేయనున్నట్లు తెలిపారు.

లాక్‌డౌన్‌ నిబందనల మినహాయింపు కార్యక్రమాలలో ధరణి లావాదేవీలు లేవని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లకు కొనుగోలుదారు, అమ్మకం దారుతో పాటు ఇద్దరు సాక్షులు కలిపి మొత్తం నలుగురు వ్యక్తులైన హాజరు కావాల్సివుంటుందని తెలిపారు. తద్వారా మండల కార్యాలయాలలో రద్దీ పెరుగుతుందని, కోవిడ్ నిబంధనల అమలు సాద్యపడదని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =