ప్రభుత్వ శాఖలు చేపట్టిన అభివృద్ది పనులకై అటవీ అనుమతులపై స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం

Minister Allola Indrakaran Reddy Chairs State Board of Wildlife Meeting Today, Telangana Minister Allola Indrakaran Reddy Chairs State Board of Wildlife Meeting Today, Allola Indrakaran Reddy Chairs State Board of Wildlife Meeting Today, State Board of Wildlife Meeting, Wildlife State Board Meeting, State Board for Wildlife, state wildlife board meeting, State Board of Wildlife, Telangana Minister Allola Indrakaran Reddy, Minister Allola Indrakaran Reddy, Allola Indrakaran Reddy, Telangana Minister, Wildlife, State Board of Wildlife Meeting News, State Board of Wildlife Meeting Latest News, State Board of Wildlife Meeting Latest Updates, State Board of Wildlife Meeting Live Updates, Mango News, Mango News Telugu,

వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం బుధవారం అరణ్య భవన్ లో జరిగింది. ఈ ఐదవ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వైస్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు చేపట్టిన 30 అభివృద్ది కార్యక్రమాలు, వాటికి అవసరమైన అటవీ అనుమతులపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చేపట్టిన రోడ్ల విస్తరణ, విద్యుత్ ఆధునీకరణ, టీ ఫైబర్ గ్రిడ్ పనుల అనుమతులపై చర్చించారు.

వైల్డ్ లైఫ్ బోర్డులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు, అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమాధానాలు వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ది కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగే విధంగా ప్రతిపాదనలు రూపొందించామని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయి అనుమతుల తర్వాత కేంద్ర అనుమతులు అవసరం అయితే, ఆ ప్రతిపాదనలు కేంద్ర వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపుతామని పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, ఎం.సీ పర్గెయిన్, డీసీఎఫ్ శ్రీనివాసరావు, స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ సభ్యులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =