సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది – మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula Kamalakar Announces State Govt will be Celebrated The Sardar Sarvai Papanna Jayanti Officially, Telangana Minister Gangula Kamalakar Announces State Govt will be Celebrated The Sardar Sarvai Papanna Jayanti Officially, Gangula Kamalakar Announces State Govt will be Celebrated The Sardar Sarvai Papanna Jayanti Officially, State Govt will be Celebrated The Sardar Sarvai Papanna Jayanti Officially, Sardar Sarvai Papanna Jayanti Officially will be Celebrated By State Govt, Sardar Sarvai Papanna Jayanti, Sardar Sarvai Papanna birth anniversary celebrations, Sardar Sarvai Papanna Jayanti celebrations, Telangana Minister Gangula Kamalakar, Minister Gangula Kamalakar, Telangana Minister, Gangula Kamalakar, State Govt, Sardar Sarvai Papanna Jayanti News, Sardar Sarvai Papanna Jayanti Latest News, Sardar Sarvai Papanna Jayanti Latest Updates, Sardar Sarvai Papanna Jayanti Live Updates, Mango News, Mango News Telugu,

సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుందని, ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న లాంటి వీరుడికి తగిన గౌరవం కల్పించటం బాధ్యతగా భావించిన సీఎం కేసీఆర్.. పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు. కాగా సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ అని కొనియాడారు. అణగారిన వర్ణాల అభివృద్ధి కోసం పాటుపడిన పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని మూడు దశాబ్దాలుగా బహుజనులు పోరాడుతున్నారని, కానీ సమైక్య పాలనలో పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు నాటి పాలకులు ఆసక్తి చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం కేసీఆర్ చొరవతో ఇప్పుడు మనం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించుకోనున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దీనిలో భాగంగానే ఈ నెల 18వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 6 =