తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28, బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో రెండు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక విద్య కమిషనర్ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో ఉండే 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ మరియు కో-ఆపరేషన్ శాఖలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అగ్రికల్చర్ ఆఫీసర్ కు సంబంధించి మల్టీ జోన్-1లో 100, మల్టీ జోన్-2లో 48 పోస్టులు ఉన్నాయి.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం 2023, జనవరి 6వ తేదీ నుంచి 2023, జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల కోసం 2023, జనవరి 10వ తేదీ నుంచి 2023, జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ (https://www.tspsc.gov.in)లో సూచించిన ప్రొఫార్మాలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన 2 నోటిఫికేషన్స్ వివరాలు:
- సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ – 37 పోస్టులు
- ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ – 91 పోస్టులు
- అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు – 148 పోస్టులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE