తెలంగాణలో మే 28 నుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

Telangana YSRTP Chief Sharmila To Resume Padayatra From May 28, Sharmila to resume yatra on May 28, YS Sharmila to resume yatra on May 28, Sharmila resumes padayatra, YSRTP president YS Sharmila would resume her Praja Prasthanam Padayatra on May 28, YS Sharmila to resume Praja Prasthana Padayatra, Telangana YSRTP Chief YS Sharmila Praja Prasthanam Padayatra To Restart From KondapakaGudem, YSR Telangana Party president YS Sharmila To Resume Padayatra From May 28, YSR Telangana Party president YS Sharmila, Telangana YSRTP Chief YS Sharmila, YSRTP president YS Sharmila, Telangana YSRTP president, YS Sharmila, Praja Prasthana Padayatra News, Praja Prasthana Padayatra Latest News, Praja Prasthana Padayatra Latest Updates, Praja Prasthana Padayatra Live Updates, Mango News, Mango News Telugu,

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతొ నిర్వహిస్తున్న పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై అధ్యయనం కోసం ఈ నెల 11వ తేదీన పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. కాగా తాజా సమాచారం ప్రకారం వైఎస్ షర్మిల తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. మే 28వ తేదీ నుంచి మళ్ళీ యధావిధిగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఈ నెల 28 నుంచి పునఃప్రారంభించనున్నారని తెలిపారు. సత్తుపల్లి వద్ద పాదయాత్రను నిలిపివేశామని, ఇప్పుడు అక్కడినుంచే మళ్లీ పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన కులాల వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. సిద్ధాంతాల ప్రకారం రాజకీయపార్టీలు నడవాలని, కులాలపై ఆధారపడి కాదని అన్నారు. కాగా లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో వైఎస్‌ షర్మిల మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − nine =