అధిష్టానం గ్రీన్ సిగ్నలే తరువాయా?

Sridhar Babus Younger Brother in MP, Sridhar Babu Brother MP, Karimnagar Politics, Sridhar Babus Younger Brother, MLC Jeevan Reddy, Praveen Reddy Jagapathi Raos Son Rajender Rao, Srinu Babu, Sridhar Babu, Latest Karimnagar Political News, Karimnagar Political News Update, Karimnagar News, Karimnagar MP, Political News, Lok Sabha Elections, Mango News, Mango News Telugu
Karimnagar Politics ,Sridhar Babu's younger brother ,MLC Jeevan Reddy, Praveen Reddy Jagapathi Rao's son Rajender Rao ,Srinu Babu

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణలో ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి అయితే అధికార కాంగ్రెస్ పార్టీలోనే  రోజురోజుకు పోటీ పెరిగిపోతోంది. ఎంత పోటీ పెరుగుతున్నా..అభ్యర్థి విషయంలో ఇంకా అధిష్టానం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

తాజాగా మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీను బాబు పేరు కూడా ఈ జాబితాలో చేరిపోయింది. కరీంనగర్ ఎంపీ బరిలో దిగడానికి శ్రీను బాబు ఆసక్తి చూపుతున్నారు. అయితే అక్కడ శ్రీధర్ బాబు చరిష్మాతో పాటు, కొత్త వ్యక్తిని రంగంలోకి దింపితే, ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోందన్న విషయం తెలిసిన శ్రీనుబాబు.. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారట.

కొద్ది రోజులుగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం  ఇంకా తమ అభ్యర్థి విషయాన్ని ఫైనల్ చేయలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్..ఈ ఎన్నికలలో  హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక్కడ కొత్త వ్యక్తిని బరిలోకి దింపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అధిష్టానం దృష్టికి రెండు మూడు పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో పాటు జగపతి రావు తనయుడు రాజేందర్ రావు పేర్లు ఉన్నాయి.

కానీ అనూహ్యంగా మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీను బాబు పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇటు శ్రీధర్ బాబుకు కరీంనగర్ పార్లమెంట్‌లో మొదటి నుంచీ మంచి పట్టుంది.దీనికితోడు ఈ నియోజకవర్గంలో… 7 పార్లమెంట్ స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే  విజయం సాధించారు. దీంతో కొద్దిగా కష్టపడితే చాలు  ఈజీగా విజయం సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతోనే తాజాగా తెరమీదకు వచ్చిన శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీను బాబు పేరును కూడా పరిశీలిస్తున్నారట.

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మంథనిలో శ్రీధర్ బాబు విజయం సాధించడానికి.. శ్రీను బాబు పాత్ర కీలకమైనదిగా పార్టీ వర్గాలు చెబుతాయి. పూర్తిగా ఎన్నికల వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుని  శ్రీధర్ బాబు విజయంలో  కీలక పాత్ర పోషించారు. అంతే కాదు ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే, కరీంనగర్ ఎంపీగా పోటీ చేయడానికి శ్రీనుబాబు సిద్ధంగా ఉన్నారట.  శ్రీను బాబును రంగంలోకి దింపడానికి ఇటు అన్న శ్రీధర్ బాబు కూడా సుముఖంగా ఉన్నారట. అయితే ఫిబ్రవరి రెండో వారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న దానిపై అధిష్టానం క్లారిటీ ఇవ్వనుండటంతో అంతవరకూ ఆ అన్నదమ్ములకు సస్పెన్స్ తప్పడం లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − five =