హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Goodbye gridlock, HITEC City RUB, HITECH City, HITECH City Railway Station, Hyderabad, KTR, KTR inaugurates HITEC City RUB, KTR throws open Hitec City RuB, Mango News, Minister KTR, Minister KTR Inaugurates Road Under Bridge, Minister KTR Inaugurates Road Under Bridge Constructed Near HITECH City Railway Station, Road Under Bridge, Road Under Bridge Constructed Inaugurated, Road Under Bridge Constructed Inauguration, Road Under Bridge Constructed Near HITECH City, Road Under Bridge Constructed Near HITECH City Railway Station

హైదరాబాద్ నగరంలో కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రోడ్‌ అండ‌ర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌ సోమవారం నాడు ప్రారంభించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.66.59 కోట్లతో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ రోడ్ అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ) ప్రారంభం కావడంతో తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండే ఈ మార్గంలో వాహనదారులకు ఊరట కలగనుంది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధ‌వరం కృష్ణారావు, మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటుగా ప‌లువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగరంలో సిగ్నల్‌ ఫ్రీ రహదారుల కోసం ఎస్ఆర్‌డీపీ కింద ఇప్పటికే ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపట్టింది. తాజాగా ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో ఆ మార్గంగుండా వెళ్లే ప్రజలకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twelve =